📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినూతన ఎస్సైని సన్మానించిన టీడీపీ నాయకులు

నూతన ఎస్సైని సన్మానించిన టీడీపీ నాయకులు

📰 Generate e-Paper Clip

ఓజిలి ఎస్సై ఎం. శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన యద్దల ధనుంజయ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి

ఓజిలి, సత్య వెలుగు న్యూస్:ఓజిలి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీనివాసరావును సోమవారం ఓజిలి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యద్దల ధనుంజయ రెడ్డి, యువ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎస్సై ఎం. శ్రీనివాసరావుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, బాధితులకు న్యాయం జరిగేలా సేవలందించాలని వారు కోరారు.

మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం మర్యాదపూర్వక వాతావరణంలో జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!