📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశెట్టిపల్లి యశ్వంత్, బురకాల లీలామోహన్ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం

శెట్టిపల్లి యశ్వంత్, బురకాల లీలామోహన్ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం

📰 Generate e-Paper Clip

-యువతను రక్తదానానికి సమీకరించిన మెగా యూత్ ఫోర్స్ – నాయుడుపేట

సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట:ప్రపంచ పవనిజం దినోత్సవం, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేటలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. శెట్టిపల్లి యశ్వంత్, బురకాల లీలామోహన్ నేతృత్వంలో రెడ్‌క్రాస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరి పిలుపుతో మెగా అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ శిబిరంలో సుమారు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా విలువలను చాటారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన లభించింది.

యువతలో సేవాభావాన్ని చాటిన యశ్వంత్, లీలామోహన్

యువతను రక్తదానం వంటి సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించడంలో శెట్టిపల్లి యశ్వంత్, బురకాల లీలామోహన్ కీలక పాత్ర పోషించారు. అభిమానాన్ని సామాజిక సేవగా మలుచుకుంటూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరాన్ని విజయవంతం చేసిన మెగా అభిమానులు, జనసైనికులు, స్వచ్ఛంద రక్తదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన రెడ్‌క్రాస్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.

రక్తదానం – ప్రాణదానం.. సేవే నిజమైన అభిమానం!

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!