📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యమదనపల్లె సభకు చౌడేపల్లి నుంచి తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు, యువ నాయకుడు ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో...

మదనపల్లె సభకు చౌడేపల్లి నుంచి తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు, యువ నాయకుడు ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి చౌడేపల్లి మండలం నుంచి టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. యువ నాయకుడు ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు సభకు బయలుదేరారు.

మదనపల్లెలో రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాయలసీమలో ఉద్యానవన సాగు, సాగునీరు, రహదారులు, కోల్డ్‌చెయిన్‌, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి చౌడేపల్లి మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా సెక్రటరీ మోహన్, వీఆర్వో మల్లికార్జున్ రెడ్డి, పందిలపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!