📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి22వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించండి ఇంటింటి ప్రచారంలో ధారా రవి

22వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించండి ఇంటింటి ప్రచారంలో ధారా రవి

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారపేట 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు గురువారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణితో కలిసి ధారా రవి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల అంశాలను ప్రస్తావిస్తూ, వార్డు అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

ధారా రవి మాట్లాడుతూ 22వ వార్డు అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

టీడీపీ పాలనలో వార్డు అభివృద్ధి నిలిచిపోయిందని ధారా రవి ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!