-బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి .
-పరిమిత వేగంతోనే ప్రయాణించండి!:
పుత్తూరు ,నవంబర్ 13, సత్య వెలుగు :వాహనదారులారా.. ఒక్క క్షణం ఆలోచించండి! అతివేగం మీ ప్రాణాలకే కాదు, మీ కుటుంబ భవిష్యత్తుకు కూడా ప్రమాదకరం. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. ఓవర్ స్పీడ్‌కు దూరంగా ఉండి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పరిమిత వేగంతో ప్రయాణించాలి.
మిమ్మల్ని నమ్ముకుని ఇంటి వద్ద భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలన్నదే వారి ఆశ.
రోడ్డు ప్రమాదం ఒక్క కుటుంబాన్ని ఎన్నో కష్టాల్లోకి నెట్టేస్తుంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి నడివీధిలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వేగం కంటే ప్రాణం ముఖ్యం.. తొందర కంటే కుటుంబమే ముఖ్యం.
ప్రజలకు విజ్ఞప్తి:
బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.
అతివేగంగా వాహనాలు నడపవద్దు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు.
కుటుంబం కోసం బాధ్యతాయుతంగా ప్రయాణించండి.
మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనది.
వేగం తగ్గించండి – ప్రాణాలను కాపాడండి!
హెల్మెట్ ధరించండి – క్షేమంగా ఇంటికి చేరండి!




