తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం, యేకొల్లు గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాలు, రహదారి సమీపంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయి ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారిపై నిత్యం చాలామంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రైతులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే తొలగించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.