📄 ePaper
Monday, November 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరు మండలంలో ఇంకా ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్!

పెళ్లకూరు మండలంలో ఇంకా ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్!

📰 Generate e-Paper Clip

-మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా ప్రారంభం కాని పోలింగ్..

-ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంపై ఉద్యోగుల ఆగ్రహం!

సత్య వెలుగు న్యూస్ | పెళ్లకూరు మండలం:పెళ్లకూరు మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. అయితే పెళ్లకూరు మండల కేంద్రంలో ఈ ప్రక్రియను నిర్వహించాల్సిన ఎన్నికల సిబ్బంది తగిన ఏర్పాట్లు చేయకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు వచ్చినప్పటికీ పోలింగ్ నిర్వహించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అక్కడికి వచ్చిన ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకే ఓటు వేసే అవకాశం కల్పించడంలో ఇలాంటి జాప్యం జరగడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల డిమాండ్:

పెళ్లకూరు మండలంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం కాకపోవడానికి గల కారణాలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే బాధ్యులైన ఎన్నికల సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్నా పోలింగ్ ప్రారంభం కాకపోవడంపై జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.*

*సత్య వెలుగు న్యూస్*
ప్రజా సమస్యలే మా ప్రాధాన్యత.. వాస్తవాలే మా వార్తలు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!