📄 ePaper
Monday, November 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు ఏ. ప్రత్యూష!

జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు ఏ. ప్రత్యూష!

📰 Generate e-Paper Clip

-70వ జాతీయ పాఠశాల క్రీడల్లో అండర్-17 బాలికల 65 కేజీల విభాగంలో ప్రతిభ

సత్యవెలుగు న్యూస్ – ఢిల్లీ: 70వ జాతీయ పాఠశాల క్రీడల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న అండర్-17 బాలికల రెజ్లింగ్ పోటీల్లో ఏ. ప్రత్యూష ప్రతిభ కనబరిచింది. 65 కేజీల బరువు విభాగంలో పోటీపడిన ఆమె తన ప్రతిభతో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

జాతీయ స్థాయి పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

రెజ్లింగ్ కోచ్ బి. ఉదయ్ కుమార్ ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వంలో ప్రత్యూష ఈ పోటీల్లో ముందుకు సాగుతోంది.

క్వార్టర్ ఫైనల్స్‌లోనూ విజయం సాధించి పతకం దిశగా దూసుకెళ్లాలని క్రీడాభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.

ఏ. ప్రత్యూషకు సత్యవెలుగు న్యూస్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు!

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!