📄 ePaper
Monday, November 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఓజిలి సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి మైలం సాయి లక్ష్మీప్రసన్న ప్రచార జోరు

ఓజిలి సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి మైలం సాయి లక్ష్మీప్రసన్న ప్రచార జోరు

📰 Generate e-Paper Clip

-ఓజిలి సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి మైలం సాయి లక్ష్మీప్రసన్న ప్రచార జోరు

-జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం..

-మహిళల హారతులు, యువత ఉత్సాహంతో సందడి.

సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 2 | నాయుడుపేట:

ఓజిలి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మైలం సాయి లక్ష్మీప్రసన్న ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. మండల కన్వీనర్ పాడి వెంకటసుబ్బయ్య, యువనేత కంకణాల ప్రసాద్ నాయుడు బలపరిచిన ఆమెకు అభిమానులు, యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. జోరువానను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

సెగ్మెంట్ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ మద్దతు కోరుతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉత్సాహం నింపుతున్నారు.

మైలం సాయి లక్ష్మీప్రసన్న ప్రచారానికి వెళ్లిన పలు ప్రాంతాల్లో మహిళలు, ఆడపడుచులు హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. అభిమానుల సందడి, మహిళల స్వాగతాలతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటోంది.

ఈ సందర్భంగా అభ్యర్థి సాయి లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల ఆశీర్వాదం, అభిమానుల మద్దతుతో ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

మొత్తంగా యువత ఉత్సాహం, మహిళల ఆత్మీయ స్వాగతాలు, అభిమానుల సందడితో ఓజిలి సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి మైలం సాయి లక్ష్మీప్రసన్న ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!