📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఈశ్వరవాక ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బట్టా రామయ్య ఘన విజయం!

ఈశ్వరవాక ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బట్టా రామయ్య ఘన విజయం!

📰 Generate e-Paper Clip

–265 ఓట్ల మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల్లో సంబరాలు

చిట్టమూరు, నవంబర్ 07 ,సత్య వెలుగు న్యూస్: చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక ఎంపీటీసీ సెగ్మెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బట్టా రామయ్య ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 265 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు బట్టా రామయ్యకు అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బట్టా రామయ్యకు పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశ్వరవాక ఎంపీటీసీ స్థానంలో ప్రజలు అందించిన తీర్పుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!