సత్య వెలుగు న్యూస్ , నాయుడుపేట: ఈరోజు నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల బ్యాలెట్ బాక్సులను నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్న పోలింగ్ బాక్సులను ఎన్నికల అధికారులు దగ్గరుండి జాగ్రత్తగా స్వీకరిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బాక్సులను నిబంధనల ప్రకారం పరిశీలించి, నిర్దేశించిన ప్రాంతాల్లో భద్రంగా అమర్చుతున్నారు. ఈ ప్రక్రియలో పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లతో పాటు ఎన్నికల అధికారులకు సహకరిస్తున్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఈ ఎన్నికల పోలింగ్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు ఈ నెల 7వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపుతో వెలుగులోకి రానుంది. కౌంటింగ్ అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



