📄 ePaper
Friday, November 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ చైర్మన్ అభ్యర్థి కోవూరు స్వప్న

నాయుడుపేట ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ చైర్మన్ అభ్యర్థి కోవూరు స్వప్న

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ , నాయుడుపేట: నవంబర్ 1వ తేదీన జరిగిన నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చైర్మన్ పదవికి పోటీ చేసిన కోవూరు స్వప్న నాయుడుపేట పట్టణ ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారని, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ప్రత్యామ్నాయ పాలన అందించిందని ఆమె పేర్కొన్నారు.
అదే తరహా ప్రజా సంక్షేమ, పారదర్శక పరిపాలన నమూనాను దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకురావాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిందని తెలిపారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని మరింత విస్తరించేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు రవి, మోహన్ రాజు, బట్టేపాటి శివానందతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క ఓటరికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తుందని కోవూరు స్వప్న పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!