📄 ePaper
Monday, August 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్చేనేత రంగానికి మరింత ఊతం: రూ.179 కోట్లతో ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభం

చేనేత రంగానికి మరింత ఊతం: రూ.179 కోట్లతో ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభం

📰 Generate e-Paper Clip

అమరావతి

చేనేత రంగ బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే ఏటా రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్, రూ.420 కోట్లతో 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేత కార్మికులకు పింఛన్, అలాగే 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు అందించిన ప్రభుత్వం, ఇప్పుడు రూ.179 కోట్లతో ‘నేతన్న సేవలో’ అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది.

ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. చేనేత కుటుంబాల సంక్షేమం, ఉత్పత్తి ప్రోత్సాహం, జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

చేనేత రంగాన్ని కాపాడుతూ, నేతన్నలకు స్థిరమైన ఆదాయం, సహాయం అందించాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమ వర్గాల్లో హర్షం కలిగిస్తోంది. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులు, చేతి పనుల ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా ఇది ఒక కీలక చర్యగా భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!