📄 ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాయలసీమకు చంద్రబాబు మరో వెన్నుపోటు: ఎంపీ గురుమూర్తి

రాయలసీమకు చంద్రబాబు మరో వెన్నుపోటు: ఎంపీ గురుమూర్తి

📰 Generate e-Paper Clip

తిరుపతి: రాయలసీమకు కేటాయించిన ప్రతిష్టాత్మక విద్యా, వైద్య సంస్థలను అమరావతికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన నైలెట్‌ శాశ్వత క్యాంపస్‌ను అమరావతికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

తిరుపతిలో నైలెట్‌ ఏర్పాటుకు గతంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి కృషి చేశామని, శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇప్పటికే విద్యా సంస్థలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్న తిరుపతి ప్రాంతంలో నైలెట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నైలెట్‌ తరలింపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని, రాయలసీమ విద్యార్థులు, యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌ వేదికగా ప్రశ్నిస్తామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!