*చెన్నై:** తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని TVK సమావేశంలో కాంగ్రెస్, VCK, MDMK, IUML పార్టీల ప్రముఖ నేతలు పాల్గొని ఉమ్మడి కార్యక్రమం, కూటమి నిర్మాణంపై చర్చించారు.
కాంగ్రెస్ తరఫున మాణికం ఠాగూర్, ప్రవీణ్ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం TVK నేతృత్వంలో కాంగ్రెస్, VCK, MDMK, IUML కలిసి కొత్త రాజకీయ కూటమిని అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. ఈ కూటమికి “సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్” అనే పేరు నిర్ణయించారు.
ఈ పరిణామం తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందా? లేక రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగమా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.


