📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుగూడలిలో రోడ్డుపైకి వ్యర్థజలాల విడుదల

గూడలిలో రోడ్డుపైకి వ్యర్థజలాల విడుదల

📰 Generate e-Paper Clip

కోట: మండలంలోని గూడలి గ్రామం స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో ఇళ్ల నుంచి వ్యర్థజలాలను రహదారి వైపు విడుదల చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు, బాత్రూం నీరు, బట్టలు ఉతికిన నీరు రోడ్డుపైకి చేరుతుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, సైకిల్‌, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

వాహనాలు వెళ్లే సమయంలో మురుగునీరు చిమ్మడంతో పాదచారులు, వాహనదారుల దుస్తులు మురికవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రహదారి పక్కన నీరు నిలవడంతో దుర్వాసన, దోమల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ అధికారులు స్థలాన్ని పరిశీలించి, రహదారిపైకి వ్యర్థజలాలు రాకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!