📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రెస్ క్లబ్ ప్రారంభించడం ఆనందంగా ఉంది: మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

ప్రెస్ క్లబ్ ప్రారంభించడం ఆనందంగా ఉంది: మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట: నాయుడుపేట పట్టణంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, విలేకరులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

శ్రీ బాలాజీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. నాయుడుపేటలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, పాత్రికేయులంతా ఐక్యంగా పనిచేసి క్లబ్‌ను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్ మాట్లాడుతూ మీడియా మిత్రుల సమస్యలను ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిత్య కృష్ణారెడ్డి, పసల గంగా ప్రసాద్, నానా బాల సుబ్బారావు, మైలారి రాజశేఖర్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ పాత్రికేయులు, విలేకరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!