📄 ePaper
Wednesday, November 11, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు రూరల్‌లో ఎస్ఎంసీ కమిటీ సభ్యుల మర్యాదపూర్వక భేటీ

పుత్తూరు రూరల్‌లో ఎస్ఎంసీ కమిటీ సభ్యుల మర్యాదపూర్వక భేటీ

📰 Generate e-Paper Clip

పుత్తూరు రూరల్, అక్టోబర్ 2: పుత్తూరు రూరల్ మండలం పరమేశ్వర మంగళం జెడ్పీ హైస్కూల్‌లో నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) సభ్యులు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, పుత్తూరు మాజీ ఎంపీపీ శ్రీ గంజి మాధవయ్యను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ యం. మణికంఠ, వైస్ చైర్మన్ ఎం.కె. రేఖ, పుత్తూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు అరవ బాలాజీ, తడుకు సింగిల్ విండో చైర్మన్ కరుణ యాదవ్, మాజీ సర్పంచ్ జయాకర్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, మునిరత్నం, బాషాతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!