📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఉప్పలమర్తి పంచాయతీలో రిఫార్మ్ ఉత్సవ్ ప్రత్యేక గ్రామ సభ

ఉప్పలమర్తి పంచాయతీలో రిఫార్మ్ ఉత్సవ్ ప్రత్యేక గ్రామ సభ

📰 Generate e-Paper Clip

చిట్టమూరు, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్:
రిఫార్మ్ ఉత్సవ్‌లో భాగంగా చిట్టమూరు మండలం ఉప్పలమర్తి పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, ఆర్‌డబ్ల్యూ జేఈ శ్రీ మహేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీ ఎల్లయ్య, టీడీపీ నాయకులు శ్రీ చిగురువాడ మురళీధర్, ఎనర్జెసీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!