📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యకాగతి పంచాయతీ అన్నిపల్లి నీటి గుంటలో వ్యక్తి అనుమానాస్పద మృతి.

కాగతి పంచాయతీ అన్నిపల్లి నీటి గుంటలో వ్యక్తి అనుమానాస్పద మృతి.

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ,అక్టోబర్ 4, సత్య వెలుగు న్యూస్:
చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ అన్నెపల్లి గ్రామానికి చెందిన బి. హరినాథ్‌రెడ్డి (38) ఆదివారం నీటి గుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం పొలానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఆయన  నీటి గుంటలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు..  హరినాథ్‌రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న చౌడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!