📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

-విద్యార్థులకు సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్‌పై అవగాహన కల్పించిన ఎస్సై శివశంకర్

పాలసముద్రం, అక్టోబర్ 7 ,సత్య వెలుగు న్యూస్:
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాలసముద్రం ఎస్సై శివశంకర్ సూచించారు. పాలసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్, క్రమశిక్షణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై శివశంకర్ మాట్లాడుతూ, ఇంటర్నెట్, కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లను ఉపయోగించి మోసాలకు పాల్పడటాన్ని సైబర్ నేరంగా పేర్కొన్నారు. బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, వారి బ్యాంకు ఖాతాల నుంచి నగదును కాజేయడం సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రధాన సైబర్ మోసాలు

డిజిటల్ అరెస్ట్: తాము పోలీసులమంటూ వీడియో కాల్ చేసి, నకిలీ కేసుల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేయడం.

టాస్క్, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు: యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, రేటింగ్ ఇవ్వడం వంటి పనుల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించి మోసాలకు పాల్పడటం.

పెట్టుబడి మోసాలు: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం.

లోన్ యాప్స్, APK ఫైల్స్: సులభంగా రుణాలు ఇస్తామని చెప్పి అనధికారిక లింకుల ద్వారా యాప్‌లు లేదా APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయించి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడం.

ఫిషింగ్ లింకులు: లాటరీ వచ్చిందని, బహుమతి గెలుచుకున్నారని, గిఫ్ట్ వచ్చిందని నమ్మించి నకిలీ లింకులపై క్లిక్ చేయించడం ద్వారా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించడం.

ఎవరైనా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, OTP, పాస్‌వర్డ్‌లు, ATM/డెబిట్ కార్డు వివరాలను ఫోన్ ద్వారా అడిగినా ఇవ్వకూడదని ఎస్సై సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫైల్స్ లేదా APKలను డౌన్‌లోడ్ చేయవద్దని విద్యార్థులకు సూచించారు.

అదేవిధంగా విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్‌కు పాల్పడకుండా క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఎస్సై శివశంకర్ సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!