📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట ప్రెస్ క్లబ్‌లో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం

నాయుడుపేట ప్రెస్ క్లబ్‌లో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం

📰 Generate e-Paper Clip

-పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు

-ఏర్పాటులో, పతనంలో జర్నలిస్టులదే కీలక పాత్ర: డాక్టర్ చింతామోహన్

సత్య వెలుగు న్యూస్ , నాయుడుపేట:నాయుడుపేట ప్రెస్ క్లబ్‌లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అభివృద్ధి, దేశంలో నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, చారిత్రక అంశాలపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు.

దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలి

గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది మహా పట్టణాలుగా ఎదగాలంటే దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఈ పోర్టు ఏర్పాటుకు కృషి చేశానని, అప్పటి పరిస్థితుల్లో దీనికి వ్యతిరేకత ఎదురైందని గుర్తుచేశారు. దుగరాజపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే వేలాది పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశముందని, తద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

పెరిగిన ధరలతో సామాన్యులకు ఇబ్బందులు

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చింతామోహన్ అన్నారు. గతంలో కిలో బియ్యం ధర రూ.20 ఉండేదని, ప్రస్తుతం రూ.80కు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.16.5 లక్షల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిందని ఆరోపిస్తూ, రైతులు, పేదల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దళితుల ఆలయ ప్రవేశానికి వందేళ్లు

తిరుపతి సమీపంలోని తిరుచానూరు హిందూ దేవాలయంలో దళితుల ప్రవేశానికి సంబంధించిన చారిత్రక ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 13న పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు డాక్టర్ చింతామోహన్ వెల్లడించారు. మహాత్మా గాంధీ హయాంలో జరిగిన ఈ చారిత్రక పరిణామాన్ని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ప్రభుత్వాల ఏర్పాటులోనూ, వాటి పతనంలోనూ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వాల విధానాలను ప్రజలకు తెలియజేయడంలో మీడియా బాధ్యత ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడి వెంకటయ్య, చందనముడి శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!