📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఉద్రిక్తతల నడుమ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు

ఉద్రిక్తతల నడుమ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, అక్టోబర్ 22 ,సత్య వెలుగు న్యూస్:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. రెండో రోజు మొత్తం 16 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నుంచి ఐదు, కూటమి అభ్యర్థుల నుంచి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.

మొదటి రోజు నామినేషన్ల సందర్భంగా ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రెండో రోజు వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు, నాయకులు కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో కొందరు నాయకులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల సహాయం కోరారు. పెళ్లకూరు ఎస్‌ఐ ఆదిలక్ష్మి, రూరల్‌ సీఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు రక్షణ కల్పించడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రెండో రోజు నామినేషన్ల వివరాలు:

మండలంలోని మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రెండో రోజు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ తరఫున ఐదు, కూటమి తరఫున 11 నామినేషన్లు నమోదయ్యాయి.

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!