📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజీపీఎస్ ట్రాకింగ్‌తో మిస్సైన ఆర్టీసీ బస్సు ఆచూకీ గుర్తింపు

జీపీఎస్ ట్రాకింగ్‌తో మిస్సైన ఆర్టీసీ బస్సు ఆచూకీ గుర్తింపు

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 22 :తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి అదృశ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అద్దె బస్సును పోలీసులు జీపీఎస్ ట్రాకింగ్ సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల వైపు వెళ్తున్న బస్సును చాగలమర్రి పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలోని గవర్నర్ పెట్ డిపోకు చెందిన ఈ బస్సు అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం తిరుపతికి చేరుకుంది. సెంట్రల్ బస్ స్టేషన్ ప్రాంగణంలో బస్సును నిలిపిన అనంతరం డ్రైవర్ నాగేశ్వరరావు, కండక్టర్ విశ్రాంతి గదికి వెళ్లారు.
బుధవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు డ్రైవర్ తిరిగి వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. దీంతో బస్సు యజమాని వెంకటేశ్వరరావు, ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు డ్రైవర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బస్సు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!