📄 ePaper
Sunday, November 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషకరం: మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

నాయుడుపేట మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషకరం: మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

📰 Generate e-Paper Clip

-ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన నాయుడుపేట ప్రజలకు కృతజ్ఞతలు

సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 1 | నాయుడుపేట: నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం సంతోషకరమైన విషయమని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్న నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ఎన్నికల సిబ్బందికి, పోలీసు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ వంతు పాత్ర పోషించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ కూడా పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై చూపిన ఆదరణ, అభిమానం, సహకారం ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పండుగను బాధ్యతాయుతంగా, ప్రశాంతంగా విజయవంతం చేసిన నాయుడుపేట ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!