📄 ePaper
Sunday, November 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి చైతన్య కృష్ణారెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం!

పెళ్లకూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి చైతన్య కృష్ణారెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం!

📰 Generate e-Paper Clip

టీడీపీ నేత వేలూరు కళ్యాణ్ రెడ్డి 

పెళ్లకూరు,  సత్య వెలుగు  న్యూస్ :పెళ్లకూరు మండల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి చైతన్య కృష్ణారెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని టీడీపీ నేత వేలూరు కళ్యాణ్ రెడ్డి కోరారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పసుపు కండ్రిగ, అనకవోలు, పెరుమాళ్లపల్లి, పుల్లూరు, రెడ్డిగుంట, కలవకూరు, ఎడపూడి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా వేలూరు కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ చైతన్య కృష్ణారెడ్డి యువ నాయకుడని, విద్యావంతుడని, సేవాభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ యువగళం స్ఫూర్తితో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో పెళ్లకూరు మండల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రస్తావిస్తూ, మండలంలో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

చైతన్య కృష్ణారెడ్డి గెలిస్తే మండలంలోని ప్రతి గ్రామానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వేలూరు కళ్యాణ్ రెడ్డి తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆయనను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు వేలూరు మురళీకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, జడ్పీటీసీ అభ్యర్థి చైతన్య కృష్ణారెడ్డి సతీమణి శర్మిష, టీడీపీ మండల నాయకులు, గ్రామ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, బూత్ కన్వీనర్లు, యువజన, మహిళా విభాగాల కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!