📄 ePaper
Monday, November 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాపులూరు ఎంపీటీసీగా రాణెమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలి

కాపులూరు ఎంపీటీసీగా రాణెమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలి

📰 Generate e-Paper Clip

-టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి పిలుపు

సత్య వెలుగు న్యూస్: అక్టోబర్ 31: నాయుడుపేట:కాపులూరు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాపులూరు రాణెమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

శనివారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కాపులూరు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని కాపులూరు, కొనకట్ట, దరఖాస్తు కండ్రిగ, వాసుదేవపురం తదితర గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని, టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై ఓటు వేసి రాణెమ్మను గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

కాపులూరు ఎంపీటీసీ అభ్యర్థి రాణెమ్మ సమర్థత కలిగిన నాయకురాలని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆమెను గెలిపిస్తే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

కాపులూరు ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి కాపులూరు రాణెమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి ఓటర్లను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో అన్నమేడు సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, టీడీపీ నాయకులు అప్పాడి సుబ్బరాయులు, కాపులూరు చక్రపాణి, నల్లూరు ప్రసాద్, నల్లూరు వీరాస్వామి, నల్లూరు సుధీర్, ఏకొల్లు రమణయ్య, ప్రభాకర్, బల్లి ఏసుదాసు, ముచ్చకాయల గోపి, కల్లూరు సీనయ్య, కాపులూరు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!