సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 31 | నాయుడుపేట:ఓజిలి మండలం సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిశెట్టి తులశమ్మ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.
ముందుగా సగుటూరు గ్రామ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్లను నేరుగా కలుసుకుని కాన్షీరాం ఆశయాలు, ఏనుగు గుర్తు ప్రాధాన్యత, రాజకీయ అధికారం, ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి వివరించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బహుజన సమాజ్ పార్టీ కృషిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని తులశమ్మ అభ్యర్థించారు.
సగుటూరు గ్రామంలో బీఎస్పీ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ సూళ్లూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు కలపాటి రామయ్య, అభ్యర్థి తులశమ్మ భర్త, బహుజన నాయకుడు నాగిశెట్టి రాజయ్య, బీఎస్పీ నాయకులు చంద్రశేఖర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

