📄 ePaper
Tuesday, November 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం!

ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం!

📰 Generate e-Paper Clip

-నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

నాయుడుపేట, నవంబర్ 03,సత్య వెలుగు న్యూస్ : తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలోని తిరుపతి నగరపాలక సంస్థతో పాటు నాయుడుపేట, సూళ్లూరుపేట, పుత్తూరు, వెంకటగిరి పురపాలక సంఘాల పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా నాయుడుపేట జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజీలుల్లాతో కలిసి పరిశీలించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను, ఎన్నికల కమిషన్ నిబంధనల అమలును తనిఖీ చేశారు.

అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, అధికారుల విధుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, నాయుడుపేట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!