📄 ePaper
Friday, November 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి అత్యధిక వార్డులు.. ఈ నెల 23న మేయర్లు, ఛైర్‌పర్సన్ల...

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి అత్యధిక వార్డులు.. ఈ నెల 23న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం!

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ , పుత్తూరు, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 3,942 వార్డులకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇందులో 755 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పార్టీల వారీగా వెల్లడైన ఫలితాల్లో టీడీపీ 2,535 వార్డుల్లో విజయం సాధించగా, వైఎస్సార్‌సీపీ 539, జనసేన 476, బీజేపీ 152 వార్డుల్లో గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థులు 121 వార్డుల్లో విజయం సాధించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ నెల 23న ప్రమాణ స్వీకారాలు

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఈ నెల 23వ తేదీని ముహూర్తంగా ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించనున్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో తదుపరి కీలక ఘట్టంగా మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిలవనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!