సత్య వెలుగు, పెళ్లకూరు: పెళ్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శిరసనంబేటి చైతన్య కృష్ణారెడ్డిని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.చైతన్య కృష్ణారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సోమవారం సాయంత్రం ఆయన నివాసానికి చేరుకుని చైతన్య కృష్ణారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టిడిపి నేత చైతన్య కృష్ణారెడ్డి త్వరగా పూర్తి ఆరోగ్యంగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.ఆయన వెంట నాయుడుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె. అశోక్ కుమార్ రెడ్డి,పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య, టిడిపి నాయకులు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, చిల్లకూరు పిఎసిఎస్ డైరెక్టర్ పెళ్ళకూరు గోపాలకృష్ణ,పలువురు నాయకులు ఉన్నారు.
- Advertisment -ads




