📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిహెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన ఇంటెన్షిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా నెలబల్లిలో అవగాహన సదస్సు, ర్యాలీ

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన ఇంటెన్షిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా నెలబల్లిలో అవగాహన సదస్సు, ర్యాలీ

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశా విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సీసీ–పీయూ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో “ఇంటెన్షిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామంలో మంగళవారం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె. బాలాజీ మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తికి సంబంధించిన కారణాలు, వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదనే అంశాలతో పాటు లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష, చిన్నచూపు లేకుండా వారిని సమాజంలో భాగస్వాములుగా చూడాలని సూచించారు. హెచ్‌ఐవీ–క్షయ వ్యాధి సంబంధం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, చికిత్సా విధానాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఇబ్బందులు, కండోమ్ వినియోగం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చట్టం–2017, ఏఆర్‌టీ మందులు, ఏపీ శాక్స్ యాప్, టోల్‌ఫ్రీ నంబర్ 1097 తదితర అంశాలపై వివరించారు.

కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఓఆర్‌డబ్ల్యూలు ఆర్. భువనేశ్వరి, కె. జయశ్రీ, ఏఎన్‌ఎం జి. శ్రీలత, పీఈ పి. కవితతో పాటు సుమారు 50 మంది ప్రజలు పాల్గొన్నారు.

అనంతరం అదే ప్రాంతంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సుమారు 50 మంది ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా 11 మంది ప్రజలకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించి, వారి పరీక్షా ఫలితాల గురించి సంబంధిత వ్యక్తులకు తెలియజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!