సత్య వెలుగు న్యూస్ : నాయుడుపేట
నాయుడుపేట పట్టణంలోని చేయూత చిన్నపిల్లల అనాథాశ్రమంలో విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేశారు. నాయుడుపేటకు చెందిన శ్రీ సాయిరాం ప్రింటర్స్ అండ్ గ్రాఫిక్స్ అధినేత నాగలాపురం అరుణాచలం ఆశ్రమంలోని విద్యార్థులకు పాదరక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా నాగలాపురం అరుణాచలం మాట్లాడుతూ, తన మాతృమూర్తి నాగలాపురం సరోజనమ్మ జ్ఞాపకార్థం అనాథాశ్రమంలోని విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు తొప్పాని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

