📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపాఠశాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి

పాఠశాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ : పాలసముద్రం

పాలసముద్రం మండలం ఎస్.ఆర్. కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ పి. కావేరి కోరారు.

మంగళవారం జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పి. కావేరి, బుధవారం పాలసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యం. వాసు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న బాత్‌రూమ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని వాసు నాయుడిని కోరారు.

ఈ విషయంపై స్పందించిన వాసు నాయుడు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులకు అందుబాటులో ఉంటూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. కండ్రిగ మాజీ సర్పంచ్ తంగరాజు, గంగమాంబపురం సర్పంచ్ హరిరాజు, వెంకటేష్ నాయుడు, బొజ్జయ్య నాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!