📄 ePaper
Monday, September 21, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యబూరగపల్లిలో మంచినీటి సమస్య పరిష్కరించాలి

బూరగపల్లిలో మంచినీటి సమస్య పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 20 (సత్యవెలుగు న్యూస్): మండలంలోని అమినిగుంట పంచాయతీ బూరగపల్లిలో నెలకొన్న మంచినీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గందోడి చరణ్ రాయల్ కోరారు.

గ్రామంలో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి తాగునీటి సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. గత కొంతకాలంగా గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి నీరు సరఫరా చేసే బోరులో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సమస్య ఏర్పడిందన్నారు.

ప్రత్యామ్నాయంగా కొత్త బోరు ఏర్పాటు చేసే వరకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చరణ్ రాయల్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!