చౌడేపల్లి, సెప్టెంబర్ 25 (సత్య వెలుగు న్యూస్): స్థానిక 4వ అంగన్వాడీ కేంద్రంలో కేంద్రం ద్వారా అందుతున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘అంగన్వాడీ ఉత్సవం’ నిర్వహించారు.
ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, పాలు, గుడ్లు, బియ్యం, బాలామృతం తదితర పోషకాహార పదార్థాల పంపిణీపై వివరించారు. 3–6 ఏళ్ల పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యతో పాటు రోజువారీ వేడి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆరోగ్య పరీక్షలు, టీకాలు, బరువు–ఎత్తు నమోదు, అభివృద్ధి స్క్రీనింగ్ వంటి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎంవీవై పథకం ద్వారా అర్హులైన గర్భిణులకు ఆర్థిక సహాయం అందుతున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధమ్మ, అంగన్వాడీ కార్యకర్త భార్గవి, ఆశా కార్యకర్త అనురాధ తదితరులు పాల్గొన్నారు.

