📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచీకట్లో సుబ్బానాయుడు కండ్రిగ గ్రామం వీధి దీపాలు ఏర్పాటు చేయాలని MRPS డిమాండ్

చీకట్లో సుబ్బానాయుడు కండ్రిగ గ్రామం వీధి దీపాలు ఏర్పాటు చేయాలని MRPS డిమాండ్

📰 Generate e-Paper Clip

 సత్య వెలుగు న్యూస్,నారాయణవనం: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం సుబ్బానాయుడు కండ్రిగ గ్రామంలోని నక్కన బోయిన అరుంధతివాడలో సుమారు 20 కుటుంబాలు నివసిస్తున్నాయని, కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని MRPS మండల అధికార ప్రతినిధి పునబాకు సాయితేజ మాదిగ తెలిపారు.

గ్రామం అడవిని ఆనుకుని ఉండటంతో రాత్రివేళల్లో విషపురుగులు, పాములు సంచరిస్తున్నాయని, గతంలో పాము కాటు ఘటనలు కూడా జరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ గ్రామంలో కనీసం వీధి విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆందోళనకరమన్నారు.

వీధి దీపాల ఏర్పాటు కోసం పంచాయతీ సెక్రటరీ, MPDOతో పాటు సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

తక్షణమే వీధి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోతే నారాయణవనం మండలంలోని 10 మాదిగ పల్లెల ప్రజలతో కలిసి పంచాయతీ సచివాలయం కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని పునబాకు సాయితేజ మాదిగ హెచ్చరించారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!