📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిస్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం, యువత, మహిళలు, విద్యావంతులకు అవకాశం: ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట...

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం, యువత, మహిళలు, విద్యావంతులకు అవకాశం: ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి పట్టపురవి.

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్,నాయుడుపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమవుతోందని సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు రవి తెలిపారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత, మహిళలు, విద్యావంతులు, మేధావులు, సామాజిక కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలతో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టే దిశగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, ఆహారం, చెరువుల మరమ్మతులు వంటి మౌలిక సమస్యలపై స్థానికంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు బట్టేబాటి శివానందం, పెళ్లకూరు మండల అధ్యక్షులు నందిమండలం మోహన్ రాజు తదితరులు పాల్గొన్నా

   

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!