📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

📰 Generate e-Paper Clip

తిరుమల, సెప్టెంబర్ 21,సత్య వెలుగు న్యూస్: తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యరూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనసేవ సమయంలో వర్షం కురిసినప్పటికీ భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వర్షం నుంచి ఉత్సవమూర్తులను రక్షించేందుకు ఘటాటోపం ఏర్పాటు చేసి వాహనసేవను కొనసాగించారు.

మురళీకృష్ణుడి అలంకారంలో వేణువు ధరించిన శ్రీవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేదమంత్రాల ఘోష, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య చంద్రప్రభ వాహనసేవ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

సంప్రదాయం ప్రకారం చంద్రప్రభ వాహనసేవకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని టీటీడీ పేర్కొంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆధిదైవిక తాపాలను తొలగించి భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని విశ్వాసం.

ఈ వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు పలువురు బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

గోవింద నామస్మరణతో తిరుమల మాడ వీధులు మార్మోగగా.. మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!