లండన్: వేల్స్‌లోని పోర్త్కాల్కు చెందిన 60 ఏళ్ల క్రిస్టోఫర్ ఫిలిప్స్ తన తల్లి సిల్వియా (89) మృతదేహాన్ని దాదాపు మూడేళ్ల పాటు ఇంట్లోని ఫ్రీజర్‌లో దాచాడు. ఆమె మరణం తర్వాత కూడా పెన్షన్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాల రూపంలో £78,190 (సుమారు ₹1 కోటి) పొందాడు.
చివరకు ఎలా బయటపడింది?
2026 ఫిబ్రవరిలో ఆమె వైద్యుడికి అనుమానం రావడంతో పోలీసులు వెల్ఫేర్ చెక్ కోసం ఇంటికి వెళ్లారు. కుమారుడు ఆమె లండన్‌కు వెళ్లిందని చెప్పడంతో అనుమానం పెరిగింది. ఇంటిని తనిఖీ చేయగా ఫ్రీజర్‌లో మృతదేహం బయటపడింది.
కోర్టు అతడికి 2 సంవత్సరాల 4 నెలల జైలు శిక్ష విధించింది.


