📄 ePaper
Sunday, September 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యశ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీరామ్ చినబాబు దంపతులు

శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీరామ్ చినబాబు దంపతులు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 13 (సత్య వెలుగు న్యూస్):
తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తన సతీమణితో కలిసి ఆదివారం చౌడేపల్లిలోని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న శ్రీరామ్ చినబాబు దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు, అర్చకులు శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు యువత నాయకులు, స్థానిక టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనంతో చినబాబు దంపతులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!