📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగుంతకల్‌లో మైనారిటీలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యత.. ముస్లిం మహిళకు చైర్‌పర్సన్‌ టికెట్‌!

గుంతకల్‌లో మైనారిటీలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యత.. ముస్లిం మహిళకు చైర్‌పర్సన్‌ టికెట్‌!

📰 Generate e-Paper Clip

గుంతకల్, సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 20: గుంతకల్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత కల్పిస్తూ, ముస్లిం మహిళకు మున్సిపల్ చైర్‌పర్సన్‌ టికెట్‌ కేటాయించి ప్రోత్సహించిన పార్టీ కాంగ్రెస్‌ అని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలందరూ ఐక్యంగా నిలిచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మైనారిటీ మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రోత్సాహం అందిస్తోందని వారు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!