📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినామినేషన్ల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులతో అధికారుల సమావేశం

నామినేషన్ల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులతో అధికారుల సమావేశం

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం పెళ్లకూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు సమావేశమయ్యారు.

మండల ప్రత్యేక అధికారి డాక్టర్ పి. ధనుంజయులు, సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై ఆదిలక్ష్మి, తహసీల్దార్ సీహెచ్ హరికృష్ణ, ఎంపీడీవో వేణయ్య ఈ సమావేశంలో పాల్గొని నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై నాయకులకు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటిస్తూ ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు.

మండల ప్రత్యేక అధికారి డాక్టర్ పి. ధనుంజయులు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో అధికారుల సూచనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియకు సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు.

సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై ఆదిలక్ష్మి మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ తరఫున తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

తహసీల్దార్ సీహెచ్ హరికృష్ణ, ఎంపీడీవో వేణయ్య ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!