📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట భద్రత , ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన...

నాయుడుపేట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట భద్రత , ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ వెంకటరమణ

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, తిరుపతి జిల్లా:తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు ఎన్నికల సంఘం నియమావళిని తప్పనిసరిగా పాటించాలని నాయుడుపేట సీఐ వెంకటరమణ సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, హింసాత్మక ఘటనలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని సీఐ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!