📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబ్రాహ్మణ తంగేల్ గ్రామంలో బీఎస్పీ ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ ప్రచారం జోరు!

బ్రాహ్మణ తంగేల్ గ్రామంలో బీఎస్పీ ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ ప్రచారం జోరు!

📰 Generate e-Paper Clip

-గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ హామీ

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 25:
బ్రాహ్మణ తంగేల్: ఎర్రకంబట్టు ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ బ్రాహ్మణ తంగేల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో డ్రైనేజీ కాలువల ఏర్పాటు, వీధి దీపాల సౌకర్యం, ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కల్పించడం వంటి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హరీష్ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ బీఎస్పీ ఇన్‌చార్జి ధన గారు కూడా పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల గుర్తు ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!