విజయపురం, సత్య వెలుగు న్యూస్: మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ శివరాజు గారి అకాల మరణవార్త పట్ల మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కే. రోజా గారి సోదరులు శ్రీ వై. కుమారస్వామి రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీ శివరాజు గారి భౌతికకాయానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా కుమారస్వామి రెడ్డి గారు మాట్లాడుతూ, శివరాజు గారి అకాల మరణం పార్టీకి, వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆయన అందించిన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.
ఈ విషాద సమయంలో శివరాజు గారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, స్వర్గీయ శివరాజు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

