📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్14 నెలల్లో 100 కోట్ల ప్రయాణాలు

14 నెలల్లో 100 కోట్ల ప్రయాణాలు

📰 Generate e-Paper Clip

– స్త్రీశక్తి పథకం ఘన విజయమన్న మంత్రి
– మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటు
– ఆర్టీసీ సేవలకు ప్రత్యేక అభినందనలు
అమరావతి, అక్టోబర్ 6, సత్య వెలుగు న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం కేవలం 14 నెలల్లోనే 100 కోట్ల ప్రయాణాల మైలురాయిని చేరుకోవడం గొప్ప విజయమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ పథకం మహిళల జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా సానుకూల మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఇది ఒకటిగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళల అవసరాలను గుర్తించి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా కుటుంబాలపై పడే ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందన్నారు. మహిళల స్వేచ్ఛాయుత ప్రయాణాలకు ఈ పథకం కొత్త దారులు తెరిచిందని చెప్పారు.
ప్రస్తుతం రోజుకు సగటున 24 లక్షల ప్రయాణాలు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ప్రయాణాలు జరగగా, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,550 కోట్లు వ్యయం చేసిందని తెలిపారు. ఈ మొత్తం మహిళల కుటుంబాలకు ఆదాగా మిగిలిందని, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ఇది తోడ్పడుతోందన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, వైద్య అవసరాల కోసం మహిళలు మరింత స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం ఈ పథకం ద్వారా లభించిందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు కూడా ఈ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటూ తమ ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను విస్తరించుకుంటున్నారని తెలిపారు. మహిళా సాధికారతకు ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారిందన్నారు.
స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని మంత్రి కొనియాడారు. ప్రతిరోజూ లక్షలాది మంది మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ విజయానికి ఆర్టీసీ సిబ్బంది అంకితభావమే కారణమని పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా మహిళలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవన స్థితిగతులను మరింత మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!