సత్య వెలుగు న్యూస్ – వెంకటగిరి:వెంకటగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ స్థానానికి 9 నామినేషన్లు దాఖలు కాగా, 36 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 216 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.
చైర్మన్ స్థానానికి దాఖలైన నామినేషన్లు:
- బీఎస్పీ – 2
- టీడీపీ – 3
- వైఎస్సార్సీపీ – 3
- ఆమ్ ఆద్మీ పార్టీ – 1
- స్వతంత్ర అభ్యర్థులు – 1
మొత్తం: 9 నామినేషన్లు
36 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలు:
- బీజేపీ – 4
- సీపీఐ – 1
- సీపీఎం – 1
- టీడీపీ – 103
- వైఎస్సార్సీపీ – 91
- జనసేన – 5
- స్వతంత్ర అభ్యర్థులు – 11
మొత్తం: 216 నామినేషన్లు
వెంకటగిరి మున్సిపాలిటీలో చైర్మన్ స్థానంతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.




