📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపీవీఎంసీ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పీవీఎంసీ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

 పుత్తూరు,అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పీవీఎంసీ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవి, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పి. రహీం ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హారున్ రషీద్, టౌన్ ప్రెసిడెంట్ సిరాజ్, రూరల్ ప్రెసిడెంట్ ఎల్. సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పాలని, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముబారక్, పెద్దపంజణం వైస్ ప్రెసిడెంట్ మల్లప్ప, ఇందుకుమార్, సుబ్బన్న, సురేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి, సేవ వంటి గాంధీజీ ఆశయాలను ప్రజలు ఆచరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!