-టీవీ5 రిపోర్టర్ అభి అయితం కుటుంబానికి పరామర్శ..
-కేవీ మణి మొదలియార్‌కు నివాళులు
వడమాలపేట, నగరి, సత్య వెలుగు న్యూస్: వడమాలపేట మండలం ఎస్బీఆర్ గ్రామానికి చెందిన టీవీ5 రిపోర్టర్ అభి అయితం గారి అక్క భర్త కేవీ మణి మొదలియార్ కర్మక్రియల కార్యక్రమానికి పోతుగుంట విజయ్‌బాబు హాజరై నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేవీ మణి మొదలియార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన విజయ్‌బాబు, కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. మృతుని కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, వారి దుఃఖంలో తాను భాగస్వామినని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు, సన్నిహితులు పాల్గొన్నారు.

